మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Rama Ashtottara Shatanama Stotram – శ్రీ రామ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః |
రాజీవలోచనః శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః || 1 ||
జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః |
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః || 2 ||
వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః |
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః || 3 ||
కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః |
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః || 4 ||
సప్తతాళప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః |
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః || 5 ||
వేదాంతసారో వేదాత్మా భవరోగస్యభేషజమ్ |
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || 6 ||
త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః |
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యకర్తనః || 7 ||
అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః |
జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః || 8 ||
ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః |
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః || 9 ||
సర్వదేవాధిదేవశ్చ మృతవానరజీవనః |
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః || 10 ||
సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః |
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః || 11 ||
సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః |
ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ || 12 ||
పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః |
స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవః || 13 ||
అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః |
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః || 14 ||
సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః |
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః || 15 ||
సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః |
విభీషణప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః || 16 ||
పరమాత్మా పరంబ్రహ్మ సచ్చిదానందవిగ్రహః |
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః |
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః || 17 ||
[* అధికశ్లోకాః –
శ్రీరామాష్టోత్తరశతం భవతాపనివారకమ్ |
సంపత్కరం త్రిసంధ్యాసు పఠతాం భక్తిపూర్వకమ్ ||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
*]
ఇతి శ్రీ రామాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.